Read more!

English | Telugu

కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు

కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించబోతున్నాడు. ఈ విషయం స్వయంగా సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ తన జన్మదినోత్సవం సందర్భంగా తెలియజేశారు. మూడువందలకు పైగా సినిమాల్లో హీరోగా నటించి, "సింహాసనం" వంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ కృష్ణ త్వరలో తన కుమారుడు, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించబోయే సినిమాకు దర్శకత్వం వహించనున్నారట.

ప్రస్తుతం మహేష్ బాబుకి సరిపోయే కథ కోసం సూపర్ స్టార్ కృష్ణ వెతుకుతున్నారు. కథ తయారుకాగానే ఈ సినిమా ప్రారంభిస్తానని కృష్ణ మీడియాతో అన్నారు. హీరోగా మహేష్ బాబుకి తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉందనీ, అతని స్టైల్ కి సరిపోయే కథ దొరకగానే తన దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించే సినిమా ఉంటుందనీ ఆయన మీడియాకు తెలియజేశారు.