Read more!

English | Telugu

'దేవర'పై కొరటాల లేటెస్ట్ కామెంట్స్.. అసలేం జరుగుతుంది?

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'దేవర' (Devara) ఒకటి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "అభిమానులు కాలరెగరేసుకునే సినిమా" అనడంతో 'దేవర'పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా దర్శకుడు కొరటాల కూడా అలాంటి కామెంట్సే చేయడం విశేషం.

సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' మూవీ మే 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ సమర్పకుడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల.. 'దేవర' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "దేవర సినిమా నాకు మరియు ఎన్టీఆర్ అభిమానులకు చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది." అని కొరటాల అన్నాడు. మొన్న ఎన్టీఆర్, ఇప్పుడు కొరటాల.. వారి కామెంట్స్ చూస్తుంటే, సినిమాపై వారికున్న నమ్మకం అర్థమవుతోంది. అలాగే సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. అసలు దేవర ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్-కొరటాల ఏం ప్లాన్ చేశారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో రోజురోజుకి పెరిగిపోతోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'దేవర'లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మొదటి సాంగ్ విడుదలయ్యే అవకాశముంది.