Read more!

English | Telugu

హీరో సూర్య తమ్ముడు విమానం నడుపుతాడట..!

తమిళనటుడు కార్తి ఊపిరి సక్సెస్ తో మంచి ఊపుమీదున్నాడు. సూర్య తమ్ముడిగా సినిమాల్లోకి ఎంటరైనా, నటుడిగా తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు కార్తి. లేటెస్ట్ గా ఈ హీరో ఫ్లైట్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. పైలట్ గా ఎలా ఉండాలి, విమానాన్ని ఎలా నడపాలి లాంటి వాటిపై క్రాష్ కోర్స్ చేస్తున్నాడు కార్తీ. ఎందుకు ఇదంతా, నటించడం మానేసి పైలట్ గా సెటిలవుతాడా అని డౌట్ పడకండి...ఇదంతా తను హీరోగా తెరకెక్కే మణిరత్నం సినిమా కోసమే. డైరెక్టర్ మణిరత్నానికి పెర్ఫెక్షనిస్ట్ అనే పేరుంది. తన సినిమాలో కార్తీ పాత్ర పైలట్ కావడంతో, యాజ్ ఇటీజ్ గా పైలెట్స్ ఎలా ఉంటారో, ఏం చేస్తారో తెలుసుకోవాలంటూ కార్తీకి చెప్పాడట. దాంతో ఇప్పుడు సూర్య తమ్ముడు పైలట్ గా క్రాష్ కోర్స్ చేస్తూ బిజీ అయిపోయాడు. మూడు వారాల పాటు ఉంటే ఈ క్రాష్ కోర్స్ లో పైలట్ సీటింగ్ ఎలా ఉంటుంది..విమానంలో ఏ స్విచ్ లను ఎలా హ్యాండిల్ చేయాలి,బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి..ఇలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇస్తారట. కోర్స్ ట్రైనింగ్ పూర్తవ్వగానే సినిమా షూటింగ్ లో కార్తీ పాల్గొంటాడు. ఈ సినిమా కూడా రోజా తరహాలో రొమాంటిక్ జానర్లో సాగుతుందని అంటున్నారు మూవీ టీం. ఈ మధ్య భారీ హిట్లేవీ లేని మణి, ఈ సినిమాతోనైనా మళ్లీ తన పాత మ్యాజిక్ ను క్రియేట్ చేస్తారేమో చూడాలి.