English | Telugu
హీరో కార్తీ నిశ్చితార్థం
Updated : May 2, 2011
హీరో కార్తీ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. వివరాల్లోకి వెళితే తమిళ అనువాద చిత్రాలు "యుగానికొక్కడు", "ఆవారా" వంటి వాటితో తేలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ప్రముఖ హీరో సూర్య తమ్ముడు కార్తీ వివాహానికి సంబంధించిన నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన రంజని చెన్నై స్టెల్లా మేరీస్ కాలేజీలో లిటరేచర్లో పి.జి.పట్టా బంగారు పతకంతో తీసుకున్నారు. ఆమెతో కార్తీకి ఏప్రెల్ 30 వ తేదీన ఈరోడ్ లో అత్యంత సన్నిహిత కుటుంబసభ్యుల మధ్య నిశ్చితార్థం చాలా నిరాడంబరంగా జరిగింది.
ఈ నిశ్చితార్థానికి కార్తీ తండ్రి శివకుమార్, తల్లి లక్ష్మీ, అన్నయ్య సూర్య, వదిన జ్యోతిక తదితరులు హాజరయ్యారు. కార్తీ, రంజనిల వివాహం తమిళనాడులోని కోయంబత్తూర్ లో జూలై మూడవ తేదీన జరుగుతుంది. కార్తీ, రంజనిల వివాహానికి సంబంధించిన రిసెప్షన్ చెన్నైలో అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. రిసెప్షన్ తేదీ(అ ఇంకా నిర్ణయించబడలేదు.