Read more!

English | Telugu

క్లైమాక్స్ లో రామ్ కందిరీగ

క్లైమాక్స్ లో రామ్ "కందిరీగ" ఉందని సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ పతాకంపై, చురుకైన యువ హీరో రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ, స్వాతి హీరోయిన్లుగా, శ్రియ ఒక ఐటమ్ సాంగ్ లో నటిస్తుండగా, సంతోష్ శ్రీనివాస్ అనే యువకుణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం " కందిరీగ ". ఈ సినిమా మొదలై ప్రస్తుతం షూటింగంతా పూర్తి చేసుకుని, క్లైమాక్స్ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ మిగిలి ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

రామ్ "కందిరీగ" సినిమాకి యువసంగీత దర్శకుడు తమన్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్ "కందిరీగ" సినిమాకి ఆండ్రూ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న క్లైక్స్ సాంగ్ కి శోబి కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ రామ్ "కందిరీగ" సినిమా మీద సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.