English | Telugu

సినిమా రిలీజ్ కాకుండానే హిట్టైంది!!

లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన న్యూమూవీ గంగ (కాంచన 2) తెలుగు, తమిళ్‌లో ఒకేసారి రిలీజ్ కావల్సివుండగా తమిళ్‌లో మాత్రమే రిలీజై తెలుగులో వాయిదా పడింది. ఈ సినిమా వాయిదాకు నిర్మాత బెల్లంకొండ సురేష్ కు వున్న ఫైనాన్స్ ట్రబుల్స్ ముఖ్యకారణంగా తెలుస్తోంది. గత సినిమాలాగే ఈ సినిమాకు బెల్లంకొండ ఓ ఫైనాన్షియర్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో రిలీజ్ కు బ్రేక్ వేశాడని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో ఈ సినిమాను వచ్చే వారంలో రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారట.

శుక్రవారం తమిళ్ లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా ఈ సినిమాకు అనుకూలంగా వచ్చాయి. ఈ సినిమా మొదటి భాగం సూపర్ గా వుందని, సెకండాఫ్ ఒకేనని అంటున్నారు. బీ,సి సెంటర్స్‌లో మాస్ ఆడియన్స్‌ను హారర్ కామెడీతో ఎంటర్‌టైన్ చేస్తుందని అంటున్నారు. తమిళ్ లో హిట్ టాక్‌తో రావడంతో తెలుగులో రిలీజ్‌కు అడ్డంకులు తొలుగుతాయని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద ఏంతో ఆసక్తిగా వున్నారు.మొత్తానికి గంగ (కాంచన 2) తెలుగులో రిలీజ్ కాకుండానే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.