Read more!

English | Telugu

కమల్ హాసన్ కు హెన్రీ లాంగ్లోయిస్ అవార్డు..!

భారతదేశం గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో కమల్ కూడా ఒకరు. ఇప్పటికే పద్మభూషణ్ తో సహా లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్న ఆయన కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్టాత్మక హెన్రీ లాంగ్లోయిస్ అవార్డ్ ఆయన్ను వరించింది. దశాబ్దాల పాటు భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను, ఈ పురస్కారం లభించింది. హెన్రీ లాంగ్లోయిస్ కు ఫ్రెంచి సినిమా చరిత్రకారుడిగా ఆ దేశ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన 1977లో తన అరవై ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమకు సేవలు అందించిన వారికి ఆయన పేరు మీద ఫ్రెంచి సినీ పరిశ్రమ అవార్డుల్ని అందిస్తోంది. తాజాగా ఆ అవార్డు మన లోకనాయకుడికి లభించింది. ఈ అవార్డును చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నానని, తనకు లాంగ్లోయిస్ గురించి చెప్పిన తన గురువు అనంతు గారు ఉండి ఉంటే, చాలా ఆనందంగా ఉండేదని కమల్ ట్వీట్ చేశారు.