Read more!

English | Telugu

ప్రభాస్ ని మార్కెటింగ్ చేస్తారా.. రెజ్యుమ్ ఫార్ వర్డ్ చెయ్యండి 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  కల్కి కి మార్కెటింగ్ టీం కావాలి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా!నేను చెప్తుంది నూటికి నూరుపాళ్లు నిజం. కల్కికి మార్కెటింగ్ టీం కావాలి. ఒక రకంగా ఇది  ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు  తెలుగు సినిమా ప్రేక్షకులకి  బంపర్ ఆఫర్ లాంటిది. బహుశా ప్రపంచ సినీ చరిత్రలోనే ఇలాంటి ఆఫర్  ఉండదంటే అతిశయోక్తి కాదు. అదేంటో చూద్దాం 

కల్కి 2898 ఏడి.. జూన్ 27 విడుదల కాబోతుంది. ఎప్పుడైతే ఈ డేట్ ని అనౌన్స్ చేసారో అప్పటినుంచి అందరిలోను కల్కి ఫీవర్ స్టార్ట్ అయ్యింది. భారతీయ ఇతిహాసాలకి సైన్స్ ఫిక్షన్ ని జోడించి తెరకెక్కిస్తుండటంతో ప్రభాస్ క్యారక్టర్ మీద అందరిలోను భారీగానే అంచనాలు ఉన్నాయి. తాజాగా కల్కి టీం ట్విట్టర్ వేదికగా ఒక ఆఫర్ ని ప్రకటించింది.గ్రాఫిక్ డిజైనర్లు ,వీడియో ఎడిటర్ లు, కంటెంట్ క్రియేటర్లు, మార్కెటింగ్ ఔత్సాహికులు కల్కి కి వర్క్ చెయ్యడానికి  కావాలి.  వీళ్లందరి చేత   కల్కి మార్కెటింగ్ జరుగుతుంది. vymcrew@gmalil.com కి రెజ్యుమ్ ని ఫార్ వర్డ్ చెయ్యవచ్చు.

ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ ని తెస్తుంది. చాలా మంది  రెజ్యుమ్ ని ఫార్ వర్డ్ చేసే పనిలో ఉన్నారు.  ప్రభాస్ సరసన దీపికా పదుకునే జత కట్టగా దిశా పాటని ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. అమితాబ్, కమల్ లాంటి సినీ దిగ్గజాలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన అమితాబ్ టీజర్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు.  మహానటి తో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకుడు.  600 కోట్ల బడ్జట్ తో కల్కి తెరకెక్కింది.