Read more!

English | Telugu

ప్రభాస్  కల్కి ఓటిటి రేటు ఫిగర్ నిజమేనా!  మరి రిలీజ్ ఉంటుందా!  

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (prabhas) ఆయన సినిమాల కోసం నేడు ఇండియా వ్యాప్తంగా కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాకి ప్రభాస్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా  ఉంది. డార్లింగ్  గురించి వార్త రాకపోతే  సోషల్ మీడియాకి అసలు  పొద్దు కూడా పోదు.   లేటెస్టుగా  ప్రభాస్ గురించి వస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.   

ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD (kalki 2898 ad) తెలుగులో తెరకెక్కుతున్న మొట్టమొదటి ఎడ్వెంచర్ మూవీ. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేముకులందరికీ భారీ అంచనాలే  ఉన్నాయి. ఇపుడు ఈ మూవీ గురించే  ఒక ఇంట్రెస్ట్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. కల్కి ఓటిటి రైట్స్ కోసం  నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి బడా సంస్థలు పోటీపడుతున్నాయని. మేకర్స్   200 కోట్లకి పైగా చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  కానీ  సదరు  ఓటీటీ సంస్థలు మాత్రం 150  నుంచి 170 కోట్ల  దాకా  ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు.మరి ఇందులో ఎంత నిజముందో కొన్ని రోజులు ఆగితే గాని తెలియదు.  

 దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తుండగా  అమితాబ్ బచ్చన్( amitabh bachchan) కమల్ హాసన్ (kanam haasan) లాంటి విశ్వ కధానాయకులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరో హీరోయిన్ దిశా పాటని ఒక ప్రత్యేక గీతంలో చేస్తుంది . నాగ్ అశ్విన్ (nag ashwin) దర్శకత్వాన్ని అందిస్తుండగా  వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఇక  మే 9న రిలీజ్ అవుతుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. మరీ ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా  ఇండియా వైడ్ గా  మే 13న ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీంతో మూవీ వాయిదా పడుతుందేమో చూడాలి. మేకర్స్ నుంచి ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు.