Read more!

English | Telugu

కాజ‌ల్ వ‌ర్సెస్ స‌మంత‌

ఈ ఫిబ్ర‌వ‌రి 12.. పంచ‌దార బొమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్, కుంద‌న‌పు బొమ్మ స‌మంత‌కు ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. అదే రోజున ఈ ఇద్ద‌రి డెబ్యూ వెబ్ సిరీసెస్ వేర్వేరు ప్లాట్ ఫ్లామ్స్ లో ప‌లు భాష‌ల్లో స్ట్రీమ్ కాబోతున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. సామ్ నెగ‌టివ్ రోల్ లో న‌టించిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్ 2 అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్ర‌వ‌రి 12న ప‌లు భాష‌ల్లో స్ట్రీమ్ కాబోతుండ‌గా.. స‌రిగ్గా అదే రోజున కాజ‌ల్ న‌టించిన త‌మిళ్ వెబ్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో అనేక భార‌తీయ భాష‌ల్లో స్ట్రీమ్ కానుంది. దీంతో.. కాజ‌ల్ వ‌ర్సెస్ స‌మంత అన్న‌ట్లుగా ఉన్న వీరిద్ద‌రి డిజిటిల్ డెబ్యూ కాంపిటీష‌న్ కాస్త ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. వీరిలో ఎవ‌రి సిరీస్ జ‌నాన్ని బాగా ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

కాగా, బృందావ‌నం, బ్ర‌హ్మోత్స‌వం చిత్రాల్లో కల‌సి న‌టించిన కాజ‌ల్, స‌మంత‌.. నిజ‌జీవితంలో మంచి స్నేహితురాళ్లు. ప‌దేళ్ళ‌కుగా పైగా వీరి స్నేహం కొన‌సాగుతోంది. ఇద్ద‌రు కూడా వివాహ‌బంధంలోకి అడుగుపెట్టాకే డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.