English | Telugu

కాజ‌ల్ బొడ్డుపై - చెర్రీ పండు

రాఘ‌వేంద్ర‌రావు సినిమా అంటే హీరోయిన్ల అందాల స్వ‌ర్గ‌ధామం అని చెప్పుకోవ‌చ్చు. క‌థానాయిక బొడ్డుపై పండ్లు, పూలు ధార‌బోస్తారు. పాలాభిషేకం కూడా చేస్తారు. హీరోయిన్ ఎవ‌రైనా స‌రే.. పండ్లతో కొట్టాల్సిందే. ద్రాక్ష‌, బ‌త్తాయి, యాపిల్‌, జామ‌.. ఇలా ఒక్క‌టీ వ‌ద‌ల్లేదాయ‌న‌. కాజ‌ల్‌కి మాత్రం.. చెర్రీ పండుతో కొట్టించుకోవాల‌ని ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని కాజ‌లే స్వ‌యంగా చెప్పింది. కె.రాఘ‌వేంద్ర‌రావు నిర్వ‌హిస్తున్న సౌంద‌ర్య‌ల‌హ‌రి కార్య‌క్ర‌మానికి కాజ‌ల్ అతిథిగా వ‌చ్చింది. ''రాఘ‌వేంద్ర‌రావు సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌స్తే.. బొడ్డుపై ఏ పండు విస‌ర‌మంటారు..?'' అని యాంక‌ర్ ఝాన్సీ అడిగింది. దానికి కాజ‌ల్ ఏమాత్రం ఆలోచించ‌కుండా `చెర్రీ పండు` అనేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాఘ‌వేంద్ర‌రావు చెర్రీ పండుతో హీరోయిన్‌ని కొట్ట‌లేద‌ట‌. అందుకే రాఘ‌వేంద్ర‌రావు కూడా ''ఓయ‌స్‌..'' అనేశారు. అంటే కాజ‌ల్‌పై త్వ‌ర‌లోనే చెర్రీ పండ్లు లారీలు లారీలు దొర్లించ‌డానికి.. రాఘ‌వేంద్రుడు రెడీ అయిపోయాడ‌న్న‌మాట‌.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.