Read more!

English | Telugu

ఎన్టీఆర్ మామూలోడు కాదు.. తెర వెనుక ఇంత చేశాడా!

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'(Devara). ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలై గ్లింప్స్ ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు చాలా రోజుల ముందుగానే ఈ సినిమా కళ్ళు చెదిరే రేంజ్ లో బిజినెస్ చేస్తోంది.

'దేవర' థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయిందని.. ఓవరాల్ గా ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ రూ.120 కోట్లకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.40 కోట్లు, ఆంధ్రాలో రూ.50 కోట్లు, సీడెడ్ రూ.30 కోట్లు బిజినెస్ జరిగినట్లు వినికిడి. ఇక నార్త్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఏఏ ఫిలిమ్స్ తో కలిసి కరణ్ జోహార్ రూ.50 కోట్లకు దక్కించుకున్నాడట. అలాగే ఓవర్సీస్ లో రూ.27 కోట్లు, కర్ణాటకలో రూ.20 కోట్లు బిజినెస్ చేసిన దేవర.. తమిళనాడు, కేరళలో కలిపి దాదాపు రూ.25 కోట్లు చేసిందట. అంటే ఓవరాల్ గా రూ.242 కోట్ల బిజినెస్ చేసిన దేవర.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.250 కోట్ల దాకా షేర్ లేదా రూ.450 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా కనీసం రూ.600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి.

దేవర మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడయ్యాయి. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని రూ.155 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా, ఆడియో రైట్స్ ని రూ.33 కోట్లకు టీ సిరీస్ దక్కించుకున్నట్లు సమాచారం. అంటే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే రూ.188 కోట్లు వచ్చాయి. 

మొత్తంగా చూస్తే.. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి 'దేవర' రూ.430 కోట్ల బిజినెస్ చేసిందట. మరి బిజినెస్ పరంగా ఇంతటి సంచలనం సృష్టించిన దేవర.. విడుదల తర్వాత వసూళ్ల పరంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఏకంగా ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. బిజినెస్ విషయంలో కూడా తారక్ కీలకంగా వ్యవహరించి బడా సంస్థలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.