English | Telugu
యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణీతల పెళ్లి పిలుపు
Updated : Apr 18, 2011
యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణీతల పెళ్లి పిలుపులు ఘనంగా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రముఖ యువ హీరో జూనియర్ యన్ టి ఆర్ వివాహం మె 5 వ తేదీన కుమారి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీ ప్రణీతతో జరుగనుంది. ఈ యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణీతల పెళ్లికి పిలుపులు మొదలయ్యాయి. ఇటీవల పెళ్ళి కొడుకు యన్ టి ఆర్ తన తండ్రి నందమూరి హరికృష్ణతో కలసి ప్రముఖ రాజకీయ నాయకులు, తన మామయ్య అయిన నారా చంద్రబాబు నాయుడు ఇంటికి స్వయంగా వెళ్ళి పెళ్ళి శుభలేఖను ఇచ్చి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన నారా చంద్రబాబు నాయుడు తాము సకుటుంబ సమేతంగా ఈ పెళ్ళికి వస్తామని తమ అంగీకారం తెలియజేశారట.
ఈ యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణీతల పెళ్లిని నాలుక్కాలాల పాటు అందరూ చెప్పుకునే విధంగా అత్యంత వైభవంగా జరిపించటానికి యన్ టి ఆర్ కాబోయే మామయ్య నార్నే శ్రీనివాసరావు సన్నాహాలు చేస్తున్నారు. తన సాటి యువ హీరో అల్లు అర్జున్ పెళ్ళికన్నా ఘనంగా తన వివాహం జరగాలని యన్ టి ఆర్ అనుకుంటున్నారట. ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.