Read more!

English | Telugu

యన్ టి ఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు

యంగ్ టైగర్ యన్ టి ఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు. మే 20 వ తేదీ యన్ టి ఆర్ జన్మదినం సందర్భంగా అతనికి తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. "నిన్ను చూడాలని" సినిమాతో తెరంగేట్రం చేసి ఎవరి అండ లేకుండా అంచలంచలుగా ఎదిగి ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమలో ఒక టాప్ పొజిషన్ కి చేరటం వెనుక అతని అవిరళ కృషి, ప్రతిభ, సమయపాలన ఉన్నాయి.

ఒక "ఆది, సింహాద్రి, యమదొంగ, అదుర్స్, బృందావనం" వంటి చక్కని చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన యన్ టి ఆర్ భవిష్యత్తులో మనకు మరిన్ని మంచి చిత్రాలను అందించాలనీ, వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టాలనీ తెలుగువన్ కోరుతోంది. ఈ సంవత్సరం బహుశ "శక్తి" సినిమా ఫ్లాపవటం వల్ల కావచ్చు యన్ టి ఆర్ తన జన్మదినోత్సవాన్ని తన భార్య, తల్లిదండ్రులు, అత్తమామల మధ్య మాత్రమే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట.