English | Telugu
దయచేసి కాపాడండి.. నా భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నాను
Updated : Sep 9, 2024
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)కెరీర్ లో ఒన్ ఆఫ్ ది సూపర్ హిట్ గా నిలిచిన మూవీ ధ్రువ. 2015 లో తమిళంలో విడుదలైన సూపర్ హిట్ మూవీ తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కింది. ఇందులో హీరో జయం రవి. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాలతో తమిళ చిత్ర సీమలో ఉన్న స్టార్ హీరోల సరసన కూడా చేరాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వం తో జాతీయ స్థాయిలో గుర్తింపు ని పొందటంతో పాటు సైరన్, ఇరైవన్ వంటి వరుస విజయాలతో తన సత్తా చాటాడు. రీసెంట్ గా ఆయన పర్సనల్ విషయం ఒకటి చర్చినీయాంశమయ్యింది.
జయం రవి(jayam ravi)కి 2009 లో ఆర్తి(aarti)తో వివాహం జరిగింది. అరవ్, అయాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా జయం రవి ఒక నోట్ రిలీజ్ చేసాడు.వ్యక్తి గత కారణాలతో తన వైఫ్ ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నాను. దయచేసి ఈ విషయంలో ఎలాంటి పుకార్లు, ఆరోపణలు చేయవద్దు. మాకు ప్రైవసీ కావాలి అంటూ తెలపడంతో పాటు సుదీర్ఘ వివరణ ని కూడా అందులో పొందుపరిచాడు. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నిజానికి గత కొన్ని రోజుల నుంచే రవి, ఆర్తి లు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అభిమానులు మాత్రం పుకార్లు గానే భావించారు. కానీ ఇప్పుడు అదే నిజమయ్యింది. తెలుగు నాట నితిన్ హీరోగా 2002 లో వచ్చిన జయం మూవీని అదే పేరుతో రవి తమిళంలో రీమేక్ చెయ్యడం వల్ల జయం రవి అనే పేరుని స్క్రీన్ నేమ్ గా పొందాడు.
జయం రవి తండ్రి పేరు ఎడిటర్ మోహన్(editor mohan)ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై తెలుగు చిత్ర సీమలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలని నిర్మించాడు. మామగారు, బావ బామ్మర్ధి, పల్నాటి పౌరుషం. హిట్లర్, హనుమాన్ జంక్షన్, మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. జయం రవి సోదరుడు మోహన్ రాజా(mohan raja)కూడా దక్షిణాదిన ఉన్న అగ్ర దర్శకుల్లో ఒకడు. చిరంజీవి(chiranjeevi)తో గాడ్ ఫాదర్ తెరకెక్కించడంతో పాటుగా ఇప్పుడు విశ్వంభర తర్వాత చెయ్యబోయే మూవీకి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు.