Read more!

English | Telugu

జైలర్  సీక్వెల్ టైటిల్ ఇదే.. రజనీ ఫ్యాన్స్ సంబరాలు 

2023 వ సంవత్సరాన్ని ఎవరు మర్చిపోయినా కూడా రజనీ ఫ్యాన్స్ మాత్రం మర్చిపోరు.ఎందుకంటే ఆ సంవత్సరం జైలర్ రిలీజ్ అయ్యింది. సుమారు 10 ప్లాప్ ల తర్వాత  రజనీ కి జైలర్ తో సక్సెస్ వచ్చింది. పైగా అది అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. తలైవా దెబ్బకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయ్యింది.పైగా ఆయన సినీ కెరీర్ లో ఉన్న నెంబర్ వన్ మూవీస్ లో ఒకటిగా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.   

జైలర్ రిలీజ్ టైం లోనే దర్శకుడు నెల్సన్  సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. గత కొన్ని రోజులుగా అందుకు సంబంధించిన  వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. కానీ లేటెస్ట్ గా వస్తున్న ఒక న్యూస్  మాత్రం ఇండియన్ సినీ ప్రేమికుల్లో జోష్ ని తెస్తుంది. జైలర్ సీక్వెల్ కి  హుకుం అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది.దీంతో రజనీ ఫ్యాన్స్  సంబరాలని షురు చేసారు.  
 ఇప్పుడు తమిళనాట ఎక్కడ చూసినా కూడా అందరి నోళ్ళల్లో  హుకుం టైటిల్ మోత మోగిపోతుంది. రజనీ సినీ కెరీర్ ని గమనిస్తే ఆయా సినిమాల విజయంలో అగ్ర తాంబూలం టైటిల్స్ కే ఉంటాయి. దాదాపుగా ఆయన సినిమా టైటిల్స్ అన్ని పవర్ ఫుల్ గా ఉంటాయి.  

ఇక నెల్సన్ ఇప్పటికే హుకుం స్క్రిప్ట్ పూర్తి చేసాడని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా  జూన్ లో  ప్రారంభం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో షూట్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దేవతా విగ్రహాల స్మగ్లింగ్ పాయింట్ తో  జైలర్ తెరకెక్కింది. ఇప్పుడు హుకుం లో ఎలాంటి కథ  చెప్పబోతున్నారో  అనే ఆసక్తి అందరిలో ఉంది. రజనీ ప్రస్తుతం వెట్టియన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీకి కమిట్ అయ్యాడు. ఆ రెండిటి తర్వాత హుకుం రానుంది. అనిరుద్ సంగీతంలో వచ్చిన  జైలర్ లోని  హుకుం సాంగ్  ఇప్పడు టైటిల్ గా రావడం విశేషం.