English | Telugu
‘జై మహేంద్రన్’ వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Oct 14, 2024
వెబ్ సిరీస్ : జై మహేంద్రన్
నటీనటులు: సైజు కురుప్, సుహాసిని మణిరత్నం, మియా జార్జ్, సురేశ్ కృష్ణ, జానీ ఆంటోనీ తదితరులు
రచన: రాజీవ్ రాజీ నయ్యర్
ఎడిటింగ్: క్రిష్డి సెబాస్టియన్
సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ రవీంద్రన్
మ్యూజిక్: సిద్దార్థ్ ప్రదీప్
నిర్మాతలు: రాహుల్ రిజి నయ్యర్
దర్శకత్వం: శ్రీకాంత్ మోహన్
ఓటీటీ : సోని లివ్
కథ:
మహేంద్రన్ (సైజు కురుప్) త్రివేండ్రం పరిధిలోని 'పలాజిక్కుళం'లో డిప్యూటీ తాశిల్దారుగా పనిచేస్తుంటాడు. అతని భార్య ప్రియా (మియా జార్జ్) గర్భవతి. మహేంద్రన్ కి ఆఫీసులో బాలు (రాహుల్ రిజీ నాయర్) కుడిభుజంగా ఉంటాడు. ఎవరు ఏ పని మీద వచ్చినా, తమకి ప్రయోజనం లేకుండా మాత్రం ఆ పని పూర్తిచేయని పరిస్థితిలో వాళ్లుంటారు. ఈ విషయంలో భర్త వైఖరిని మహేంద్రన్ భార్య ప్రియా ఖండిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్కడికి తాశీల్దారుగా శోభ (సుహాసిని) వస్తుంది. కూతురు చిన్నప్పుడే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె, అప్పటి నుంచి తల్లి - తండ్రి తానై కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది. ఆఫీసుకి తీరుబడిగా వచ్చే మహేంద్రన్ కి, శోభ చాలా సిన్సియర్ అనే విషయం అర్థమవుతుంది. ఆమె క్రమశిక్షణకి తగినట్టుగా నడుచుకోవడం వాళ్లకి కష్టంగా మారుతుంది. ముఖ్యంగా శోభ పట్ల మహేంద్రన్ తీవ్రమైన అసంతృప్తితో ఉంటాడు. ఇంతలో అతను ఈ కేసు నుంచి బయటపడటానికి ఏం చేయాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి వస్తాడు. తనకి జాబ్ చాలా అవసరమనీ, డబ్బుతో కూడిన మరో మార్గంలోనైనా ఈ కేసు నుంచి బయటపడాలని అతనితో శోభ అంటుంది. పైసా ఖర్చు చేయకుండానే తమ సీట్లలో తాము కూర్చుంటామని చెప్తూ, మహేంద్రన్ ఒక ప్లాన్ చేస్తాడు. మహేంద్రన్ ఆ కేసు నుండి బయటపడ్డాడా.. లేదా.. అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఈ వెబ్ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్ లు గా సాగుతుంది. మొదటి ఎపిసోడ్ పాత్రల పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ మోహన్.. రెండో ఎపిసోడ్ లో కథలో కాస్త వేగం పెంచాడు. అయితే కథలోని కామెడీలో సహజత్వం లోపించింది.
తాశీల్దారు ఆఫీసులో ఒక మూలన బెంచ్ వేసుకుని కూర్చుని, అక్కడ జరిగే తతంగం చూస్తున్నట్టుగా ఈ సిరీస్ చూస్తుంటే అనిపిస్తుంది. అంతే తప్ప, ఏ వైపు నుంచి కూడా సరదాగా నవ్వుకునే వినోదాన్ని దర్శకుడు రాబట్టలేకపోయాడు. ఇటు మహేంద్రన్ .. అటు శోభ ఫ్యామిలీ నేపథ్యం కూడా చూపించారు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేసే ప్రయత్నం చేయలేదు.
ముఖ్యమైన పాత్రలకి మంచి వెయిట్ ఉంటుందేమోనని అనుకోవడం సహజం. కానీ ఆ స్థాయిలో వారి పాత్రను డిజైన్ చేయలేదు. చివర్లో కాస్త హడావిడి చేశారు గానీ, ప్రేక్షకులు పట్టించుకునే స్థాయిలో అది లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా అలా సాదాసీదాగా ఈ కథ నడిచిపోతూ ఉంటుంది
నటీనటుల పనితీరు:
మహేంద్రన్ పాత్రలో సైజు కురుప్, ప్రియా పాత్రలో మియా జార్జ్, బాలు పాత్రలో రాహుల్ రిజి నయ్యర్, శోభగా సుహాసిని ఆకట్టుకున్నారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ ఇది. వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్: 2.5/5
✍️. దాసరి మల్లేశ్