Read more!

English | Telugu

గుంటూరు కారంలో నా క్యారక్టర్ నచ్చలేదు.. అసలు నిజం చెప్పారు

సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మూవీ గుంటూరు కారం(guntur kaaram) టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. కాకపోతే థియేటర్స్ లో ఉన్నన్ని రోజులు త్రివిక్రమ్ డైరెక్క్షన్ బాగోలేదని, కథ బాగోలేదని, థమన్ మ్యూజిక్ బాగోలేదని ఇలా రకరకాల విమర్శలు అయితే వచ్చాయి.అప్పట్లో మూవీలో నటించిన నటులెవరు గుంటూరు కారం గురించి పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాంటిది  తాజాగా ఒక అగ్ర నటుడు గుంటూరు కారంలోని అసలు నిజం చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది. 
   
జగపతి బాబు(jagapathi babu) ఒకప్పుడు  హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.ఫ్యామిలీ, యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు.  ఆయన కంటు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా  విభిన్నమైన  పాత్రలని  పోషిస్తు  ముందుకు దూసుకుపోతున్నాడు.ఇటీవల అయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో  గుంటూరు కారం గురించి పలు రకాల వ్యాఖ్యలు చేసాడు. నిజాయితీగా మాట్లాడుకోవాలంటే  తన క్యారక్టర్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాను. నాకు  మహేష్ కి  మధ్య వచ్చే  సీన్స్ ని పూర్తి స్థాయిలో  ఆస్వాదించలేకపోయాను. నా  క్యారక్టర్  గజిబిజిగా మారడం వల్ల షూటింగ్ ని  పూర్తి చేయడం చాలా కష్టంగా అనిపించింది.ఇప్పుడు జగపతి బాబు చెప్పిన ఈ మాటలన్నీ వైరల్ గా మారాయి.  నిజానికి మహేష్  నేను గత సినిమాల్లో  స్క్రీన్‌పై చాలా బాగా కలిసి పని చేసాం. తనతో ఎప్పుడూ పని చేయాలనే కోరిక ఉంటుంది. అలాంటి స్టార్ తో నటించే అవకాశం వస్తే ఛాన్స్ వేస్ట్ చేసుకోనని కూడా  చెప్పాడు.

 ఇక గుంటూరు కారంలో  డొక్కా మార్క్స్ బాబు గా జగపతిబాబు కనిపించాడు. మహేష్, జగపతి బాబు లు తొలిసారి శ్రీమంతుడులో కలిసి నటించారు. తండ్రి కొడుకులుగా సూపర్ గా నటించి ఆ సినిమా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరూ, మహర్షి లాంటి చిత్రాల్లో నటించారు.ఆ రెండు చిత్రాలు  కూడా మంచి విజయాన్ని సాధించాయి.