Read more!

English | Telugu

మోస్ట్ వాంటెడ్... 3 కోట్లు డిమాండ్

ఫ్యామిలీ హీరో  పాత్రల నుండి విలన్ పాత్రలకు టర్నింగ్ ఇచ్చుకుని భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడట జగపతి బాబు. అవునండి ఇది నిజం... టాలీవుడ్ లో హీరోగా అవకాశాలు లేక బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమాలో జగ్గుబాయ్ అనే క్యారెక్టర్ తో విలన్ గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన సత్తా చూపించాడు. లెజెండ్ తర్వాత మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో హీరో తండ్రిగా, పిల్లా నువ్వులేని జీవితం చిత్రంలో నటించి మెప్పించాడు.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో చిత్రంలో స్టైలిష్ విలన్ గా అదరగొట్టేశాడు. ఈ చిత్రం హిట్ అవ్వడంతో తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేశాడు జగపతి బాబు. కాగా నాన్నకు ప్రేమతో చిత్రంలో నటించడానికి 2 కోట్లకే ఒప్పుకున్న జగపతి బాబు ఆ చిత్రం రిలీజ్ అయిన తర్వాత 3 కోట్లు డిమాండ్ చేస్తుండడంతో నిర్మాత గగ్గోలు పెడుతున్నాడట. జగపతి బాబు చిన్న హీరోలకు పెద్ద హీరోలకు మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారడంతో చేసేదేమీ లేక ఆయన అడిగింత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట