English | Telugu

రెండో కథ మొదలైందని చెప్పిన ‘బలగం’ డైరెక్టర్!

వేణు ఎల్దండి.. బలగం మూవీతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే ఈ మూవీ సినీ రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది. ప్రతి పల్లెలో ఈ 'బలగం' మారుమ్రోగుతోంది. మొదటి సినిమానే ఇంత భారీ విజయం సాధించడంతో.. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వేణు. ఇప్పటికే ఈ మూవీ పలు అవార్డులు సొంతం చేసుకుంది.

వేణు మొదటగా తన కెరీర్ ని చిన్న చితక పాత్రలతో స్టార్ చేసాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో లో వేణు వండర్స్ టీం కి లీడర్ గా చేసి మంచి ఫేమ్ సంపాదించాడు. కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లోనే కొనసాగిన వేణు.. కొన్ని కారణాల వల్ల ఆ షోకి దూరమయ్యాడు. చాలా రోజులు తెరపై కన్పించని వేణు.. బలగం మూవీతో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. బలగం సినిమా డైరెక్ట్ చేసి.. ఆ సినిమాలోనే తను కూడా చిన్న పాత్రని పోషించిన విషయం తెలిసిందే.

బలగం మూవీ హిట్ అవడంతో వేణు పాపులారిటీ మరింత పెరిగింది. జబర్దస్త్ నుండి వేణుకి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అందుకే మొదటినుండి వాళ్ళు ముగ్గురు ఏ వెకేషన్ అయినా కలుస్తుంటారు. వాళ్ళు ముగ్గురు ఈ మధ్య కులు, మనాలి వెళ్ళి సరదగా గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వేణు తన ఇన్ స్టాగ్రామ్ లో ' 2 స్టార్ట్' అని ఒక పోస్ట్ చేసాడు. దానికి విక్రమ్ మూవీలోని.. 'ఇక మొదలెడదామా' అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ సెట్ చేసాడు వేణు. దీన్ని బట్టి తెలుస్తుంది తన రెండవ సినిమాకి స్టోరీ రాస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వేణు ఎల్దండి.. తన రెండవ సినిమా ఎలా ఉంటుందో? ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.