English | Telugu

IC 814 The Kandahar Hijack Review: ఐసీ 814 ది కాందహార్ హైజాక్ రివ్యూ

వెబ్ సిరీస్ : ఐసీ 814 ది కాంధార్ హైజాక్
నటీనటులు :  విజయ్ వర్మ, నసీరిద్దీన్ షా , పంజక్ కపూర్, రాజీవ్ ఠాకూర్, కుముద్ మిశ్రా, అరవింద స్వామి
ఎడిటింగ్: ప్రీతమ్ కల్వార్, అమర్ జిత్ సింగ్
మ్యూజిక్: రిచర్డ్ హార్వే
సినిమాటోగ్రఫీ: రవికిరణ్ అయ్యగారి, ఇవాన్ ముల్లిగాన్
రచన, దర్శకత్వం: అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

కథ : 
కాఠ్మండు నుండి ఢిల్లీకి వెళ్తున్న ఓ ఫ్లైట్ ని కొంతమంది ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. ఆ ఫ్లైట్ పేరు 'ఐసీ 814'. ఇందులో మొత్తం 176 మంది ప్రయాణికులు ఉంటారు. కెప్టెన్ తలపై ఉగ్రవాదులు తుపాకీ పెట్టి ఫ్లైట్ ని కాబూల్ కి తీసుకెళ్ళమని బెదిరిస్తారు. మరి ఆ విమానం కాబుల్ కి వెళ్ళిందా? అసలు ఉగ్రవాదులు ఎందుకు హైజాక్ చేశారు? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది అనేది మిగతా కథ.

విశ్లేషణ:
1999 లో జరిగిన రియల్ స్టోరీనే 'కాందహార్ హైజాక్'. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్దది. ఈ సిరీస్ ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతీ ఎపిసోడ్‌ అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది డీటేయిలింగ్ ఇస్తూ అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ కథని వివరించారు. 

వాస్తవంగా జరిగిన కథని తెరకెక్కించాలంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడేం జరిగిందనేది చూపించాలంటే అటు ప్రభుత్వం‌ పర్మిషన్, ఇటు ఆ ఆఫీసర్ ల ఎమోషన్స్ ని తీసుకొని కథని మలచాలి. అవన్నీ ఫాలో అవుతూనే కథని అర్థమయ్యేలా చెప్పారు మేకర్స్.  'ఒకసారి నువ్వు తుపాకీ పట్టుకున్నావంటే ఒకరి ప్రాణం తీసేటప్పుడు వెయ్యిసార్లు ఆలోచించాలి. అదే ఒక ప్రాణం కాపాడటానికి ఆలోచించక్కర్లేదు.. ఇది ప్రజలని కాపాడిన సమయం' అంటూ మొదలయ్యిన ఈ కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అయితే అప్పుడేం జరిగిందనేది ప్రతీది క్లియర్ గా వివరించే ప్రయత్నం చేశారు మేకర్స్. దీంతో నిడివి కాస్త ఎక్కువ అయింది.

ఈ కాందహార్ హైజాక్ అనేది ఏవియేషన్ చరిత్రలోనే లాంగెస్ట్ హైజాక్. ఎందుకంటే నేపాల్ లోని కాఠ్మండు నుండి అమృత్ సర్, అక్కడి నుండి దుబాయ్, అక్కడి నుండి లాహోర్ , ఫైనల్ గా కాందహార్ లో ఆపి అక్కడ డిమాండ్లు చెప్పడంతో దీనికి ఆ పేరొచ్చింది.

సిరీస్ మొత్తం ఎంత ఇన్ఫర్ మేటిక్ గా తీసినా ఎంటర్‌టైన్మెంట్ లేకపోతే ఆడియన్ చివరి వరకు ఎలా‌ చూస్తాడు. పైగా ప్రతీ ఎపిసోడ్ లో పది నిమిషాలు ఎంగేజింగ్ సీన్లు ఉంటే మిగతాదంతా డీటేయిలింగ్ ఇచ్చారు మేకర్స్. దాంతో కాస్త నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. వాస్తవంగా ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాలి. ప్రతీది డీటేయిలింగ్ ఇచ్చారు మేకర్స్‌. 

నటీనటుల పనితీరు: 
కెప్టెన్ దేవీశర్మగా విజయ్ వర్మ ఒదిగిపోయారు. నసీరుద్ధీన్ షా, పంజక్ కపూర్, రాజీవ్ ఠాకూర్, కుముద్ మిశ్రా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. 

ఫైనల్ గా... 
కాస్త సాగదీత ఉన్నా ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్. 

రేటింగ్: 2.75 / 5 

✍️. దాసరి మల్లేశ్