English | Telugu

ఇలియానా అలా ఎలా చేసింది?

ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోయిన్లే "నెగిటివ్ రోల్స్" చేయమంటే.. "బాబోయ్ మా కెరీర్ పాడైపోతుంది" అంటూ మూతి ముప్పైమూడు వంకర్లు తిప్పుతున్నారు. కానీ.. టాలీవుడ్ ను ఓ దశాబద్ధంపాటు ఓలలాడించిన గోవా బ్యూటీ ఇలియానా మాత్రం క్యారెక్టర్ లోని డెప్త్ అర్ధం చేసుకొని నెగిటివ్ రోల్ చేయడానికి అంగీకరించింది. 

నిన్న విడుదలైన అక్షయ్ కుమార్ తాజా చిత్రం "రుస్తుం" ట్రైలర్ లో అక్షయ్ భార్యగా ఇలియానా నటించింది. అయితే.. ఆమెది భర్తకు తెలియకుండా మరొక మగవాడితో అక్రమ సంబంధం పెట్టుకొనే పాత్ర. ఈ పాత్ర కోసం బాలీవుడ్ లో తొలుత ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ ల ప్రేర్లు వినిపించినప్పటికీ.. వారెవరూ ఈ తరహా పాత్ర పోషించడానికి ముందుకు రాకపోవడంతో.. చివరికి ఈ అవకాశం ఇలియానాకు దక్కింది. తనకు దక్కిన అవకాశాన్ని ఇలియానా పూర్తి స్థాయిలో వినియోగించుకొంది. రుస్తుం భార్యగా జీవించేసింది. ట్రైలర్ లో ఇలియానా నటన చూసినవాళ్ళందరూ "శభాష్" అంటున్నారు. ట్రైలర్ కే ఈ స్థాయి రెస్పాన్స్ వస్తే.. ఇక సినిమా విడుదలయ్యాక ఆమెకు ఇంకెంత భారీ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో చూడాలి!