English | Telugu

'దేవర'కు షాకిచ్చిన హైకోర్టు..!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'దేవర' (Devara)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవరకు ఏపీలో 14 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా పది రోజుల వరకే టికెట్ ధరలు పెంచుకునేలా గతంలో ప్రభుత్వం జీవో ఇచ్చిందని కోర్టుకి తెలిపిన పిటిషనర్.. 14 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేశారు. పిటిషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. టికెట్ ధరల పెంపుని పది రోజులకే పరిమితం చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.