Read more!

English | Telugu

ఆ సినిమా హిట్టయిందని ఖుష్ అవుతున్న నితిన్..!

సూర్య ట్రిపుల్ రోల్ చేసిన 24 సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజైన ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తోంది. దీంతో నితిన్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. విషయంలోకి వెళ్తే, భారీ బడ్జెట్ గా తెరకెక్కిన 24 సినిమాను నితిన్ సంస్థ శ్రేష్ట్ మూవీస్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేద్దామనుకున్నారు. నితిన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అ ఆ సినిమాను మే 6న రిలీజ్ చేద్దామనుకున్న నితిన్ అండ్ కో, తెలుగు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోమని అడిగారని, అందుకు సూర్య ఒప్పుకోకుండా ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేస్తానని చెప్పడంతో, శ్రేష్ట్ మూవీస్ కు, నితిన్ కు గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి.

దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో జ్నానవేల్ రాజా స్వయంగా రిలీజ్ చేస్తున్నాడని ట్రేడ్ వర్గాల సమాచారంతో, ఇది నిజమేనని అందరూ ఫిక్సయ్యారు. అయితే సినిమా రిలీజ్ ముందు నుంచి నితిన్ తన ట్విట్టర్లో 24 కు సపోర్ట్ గా సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశాడు. రిలీజై హిట్ టాక్ తెచ్చుకుందని తెలిసిన తర్వాత, ఇలాంటి గొప్ప సినిమాతో అసోసియేట్ అవడం చాలా ఆనందంగా ఉంది, విక్రమ్ సూర్యలకు థ్యాంక్స్ అంటూ మళ్లీ ట్వీట్ చేశాడు. దీంతో ఇన్నాళ్లూ నితిన్ సూర్యల మధ్య వివాదం నడుస్తుందన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.