Read more!

English | Telugu

ఆ మహానుభావులకు పాదాభివందనాలు - హీరో నవదీప్

హీరో నవదీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని, పోలీసులు దాడి చేసి ఫారిన్ లిక్కర్ తో పాటు, పార్టీ మ్యానేజర్ ను అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండలంలో నవదీప్ కు ఫామ్ హౌస్ ఉందని, అక్కడ మరికొంత మంది హీరోలతో పార్టీ చేసుకుంటుండగా, పోలీసులు దాడి చేశారని, మ్యానేజర్ తో పాటు ఒక ప్రముఖ హీరోను అరెస్ట్ చేశారని ఆ వార్తల సారాంశం.

దీనిపై నవదీప్ తన ట్విట్టర్లో స్పందించారు. తల్లిదండ్రులు, ఫ్యామిలీలతో కలిసి గృహప్రవేశంతో పాటు, డిన్నర్ ను జరుపుకుంటుంటే, కనీసం తనను సంప్రదించకుండా వార్తలు రాసేశారని తన ట్విట్టర్లో మండిపడ్డారు నవదీప్. తనతో పాటు తన తల్లి కూడా ఉన్నారని, టిఆర్పీల కోసం జర్నలిస్టులు ఇలా చేయడం కరెక్ట్ కాదని నవదీప్ తన ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు పోట్టరీలు చేస్తూ, పెద్దలు ఫ్యామిలీలతో కలిసి బాండ్ అవుతూ గడిపిన ఒక గృహప్రవేశాన్ని రేవ్ పార్టీ చేసిన మహానుభావులకు పాదాభివందనాలు అంటూ ట్వీట్ చేశారు నవదీప్. చివర్లో, ఇక మరొక న్యూస్ చూసుకోండి అంటూ నవదీప్ ఫినిషింట్ టచ్ ఇవ్వడం కొసమెరుపు.