Read more!

English | Telugu

నాని - ఒక పక్కింటి కుర్రాడు

కష్టపడితే ఫలితం ఉంటుందన్న సూక్తికి అతను కరెక్ట్ ఎగ్జాంపుల్. చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ, చాలా సహజంగా నటిస్తూ, నేచురల్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోవడం, ఈజీగా నటించడం అతనికి సహజంగానే అబ్బిన విద్య అనిపిస్తుంది. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఊపు మీదున్న ఆ పిల్ల జమిందార్ హీరో నాని పుట్టిన రోజు ఈ రోజు. అతనికి హ్యాపీ బర్త్ డే చెబుతూ, అసలు నాని సినిమాల్లో, రియల్ లైఫ్ లో మనకు కనబడే నాని టైప్ క్యారెక్టర్స్ పై లుక్కేద్దాం..చలో..

మహేష్ (అష్టా చమ్మా)

లోపల ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలనుంటుంది. కానీ ఆర్ధిక పరిస్థితులో, లేక పరిసరాల పరిస్థితులో, ఆపేస్తుంటాయి. ఎప్పుడైనా ఒకే ఒక్కసారి కనీసం అప్పు చేసైనా, ఎంజాయ్ చేయాలిరా అనుకునే టైప్ క్యారెక్టర్. మనలో చాలా మంది లైఫ్ లో ఒక్కసారైనా ఇలా ఫీల్ అయి తీరతాం..కాదంటారా..?

సూరి (భీమిలి కబడ్డీ జట్టు)

 

వీడు చాలా సైలెంట్. అమ్మాయిని లవ్ చేసినా, చెప్పలేనంత సైలెంట్. పాపం చూపులతోనే లైఫ్ అంతా గడిపేస్తాడు. హానెస్ట్ పర్సన్ అని చెప్పచ్చు.

గౌతమ్ (అలా మొదలైంది)

అబ్బో...ఈ టైప్ ఫ్రెండ్స్ ప్రతీ గ్రూప్ లోనూ ఒక్కడైనా ఉంటాడు. వీడి బిల్డప్స్ మామూలుగా ఉండవు. జుట్టు ఊడకపోయినా, ఊడిపోతుందని భయపడిపోతుంటాడు. పక్కోడికి వీడికంటే ఎక్కువ ఊడిందని వెక్కిరిస్తుంటాడు. మాటల్లో వెటకారం అడుగడుగునా కనిపిస్తుంది. కానీ ఎలా ఉన్నా వదులుకోలేనంత మంచోడు.

పిజే (పిల్ల జమిందార్)

క్లాస్ లో వీడిచ్చే కటింగ్ లు అలా ఇలా ఉండవు. రోజుకో ఫోన్ తెస్తుంటాడు. అందరికీ చూపిస్తూ, ఇండైరెక్ట్ గా వెక్కిరిస్తాడు. వీడు జస్ట్ పాస్ అయితే చాలు, ఫ్రెండ్స్ కి పార్టీ. మహా బలుపుగా ఉంటాడు. ఫ్రెండ్స్ తో మాత్రం చాలా ఇష్టంగా ఉంటాడండోయ్...

నాని (ఈగ)

ప్రేమించిన అమ్మాయి ఛీ కొడితే, నన్ను కాబట్టి ఛీకొట్టింది. నేనంటే ఎంత ప్రేమో అనుకునే మిత సంతోషి. పాపం అమ్మాయిని జెన్యూన్ గా లవ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎదుటపడి నువ్వంటే నాకిష్టం అని చెప్పడు. ఇన్ డైరెక్ట్ గా ఆ అమ్మాయికి సిగ్నల్స్ ఇస్తూ టైం పాస్ చేస్తాడు. వేరే ఎవరైనా, ఆ అమ్మాయి జోలికొస్తే మాత్రం ఊరుకోడు.

లక్కీ (భలే భలే మగాడివోయ్)

ప్రతీ బ్యాచ్ లో లక్కీగాడు ఒకడుంటాడు. ఒకటి చేస్తూ ఇంకోటి మర్చిపోవడం మనందరికీ అలవాటే. కాకపోతే, వీడికి కాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పార్టీకి వెళ్లినప్పుడు పర్స్ మర్చిపోవడం వీడి మేజర్ క్వాలిటీ

కృష్ణ (కృష్ణ గాడి వీరప్రేమగాథ)

ఎప్పుడూ చాలా పిరికిగా కనిపిస్తాడు. కానీ అదేంటో, కొన్ని సందర్భాల్లో వీడికి ఒక్కసారిగా ధైర్యం వచ్చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయికి లవర్ గా మారగానే వీడిలో కంప్లీట్ ఛేంజ్ వచ్చేస్తుంది. ప్రేమ మహత్యం కావచ్చు.

అదండీ విషయం. మరి ఈ నేచురల్ స్టార్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం..