Read more!

English | Telugu

ఎన్టీఆర్ తో హిట్టు కొడ‌తా... లెక్క స‌రిచేస్తా

చిత్ర‌సీమ‌లో ఒక్కోసారి అంచ‌నాల‌కు అంద‌ని కాంబినేష‌న్లు సెట్ట‌వుతుంటాయి. స్టార్ హీరో.. ఫ్లాప్ ద‌ర్శ‌కుడి క‌థ‌కు ఓకే చెప్ప‌డం.. ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితో మ‌ళ్లీ ఓ సినిమా ఆఫ‌ర్ చేయ‌డం.. త‌ర‌చూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి ఓ షాకింగ్ కాంబినేష‌న్ సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. రామ‌య్యా వ‌స్తావ‌య్యాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని దారుణంగా నిరాశ ప‌రిచాడు హ‌రీష్ శంక‌ర్‌. ఆ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో... హ‌రీష్ శంక‌ర్ కెరీర్ గ్రాఫ్ కూడా ప‌డిపోయింది.

అయితే ఈసారి ఎన్టీఆర్ తో ఓ సినిమా తీసి, హిట్టు కొడ‌తా... లెక్క స‌రిచేస్తా - అంటూ వీలైన‌ప్పుడ‌ల్లా తొడ గొడుతూ ఛాలెంజ్ చేస్తున్నాడు... హ‌రీష్ శంక‌ర్‌. ఈమ‌ధ్య సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు హ‌రీష్‌. అదే  జోరుతో ఎన్టీఆర్‌కి క‌థ చెప్పి ఒప్పించాల‌ని చూస్తున్నాడు. కాక‌పోతే.. ఎన్టీఆరే క‌థ వినిపించే అవ‌కాశం కూడా ఇవ్వ‌డం లేద‌ట‌. ''ఎన్టీఆర్ ఒక్క‌సారి క‌థ వినవ‌య్యా'' అని అడుగుతున్నా.. చూద్దాం, చేద్దాం అంటున్నాడ‌ట‌. నాన్న‌కు ప్రేమ‌తో త‌ర‌వాత ఎన్టీఆర్‌.. కొర‌టాల శివ సినిమా ప‌నుల్లో ప‌డిపోయాడ‌ని, అందుకే హ‌రీష్ కి టైమ్ కేటాయించ‌లేక‌పోతున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు హ‌రీష్‌.. ఎన్టీఆర్ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురుచూస్తున్నాడు. మ‌రి.. ఈ కాంబినేష‌న్ ఎప్పుడు సెట్ట‌వుతుందో చూడాలి.