English | Telugu

ప్రభుదేవా నా అన్నయ్య వంటి వాడు -హన్సిక

ప్రభుదేవా నా అన్నయ్య వంటివాడు అని ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వానీ అంటూంది. వివరాల్లోకి వెళితే ఈ మధ్య "ఎంగేయుం కాదల్" అనే చిత్రంలో నటిస్తున్నప్పుడు ప్రభుదేవాతో హన్సిక మోత్వాని బాగా సన్నిహితంగా మెలిగిందనీ, హన్సిక మీద మోజుతోనే ప్రభుదేవా నయనతారని వివాహం చేసుకోకుండా అన్యాయం చేస్తున్నాడనీ ఒక రూమర్ తమిళ సినీ పరిశ్రమలో బాగా ప్రబలంగా ఉంది.

దీన్ని ఖండిస్తూ హన్సిక " ప్రభుదేవా నాకు అన్నయ్య వంటివాడు...! మా మధ్య అన్నాచెల్లెళ్ళ సంబంధమే తప్ప చాలా మంది ఊహిస్తున్నట్లు వేరే సంబంధం ఏమీ లేదు...!" అని అంటుంది. చెడపకురా చెడేవు అన్న సామెత నయనతారకు వర్తిస్తుంది. అది తనకెక్కడ చుట్టుకుంటుందోనని హన్సిక భయపడుతున్నట్టుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.