Read more!

English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన షఫీ..

'సలార్ 2' (Salaar 2) షూటింగ్ విషయంలో సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. మే చివరిలో షూటింగ్ మొదలవుతుందని కొందరు.. వచ్చే ఏడాదికి వాయిదా పడిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో 'సలార్ 2' ఎప్పుడు మొదలవుతుందో తెలియక ప్రభాస్ (Prabhas) అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కి తెరపడింది.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ 'సలార్'. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని గతంలోనే ప్రకటించారు. మొదటి భాగం గతేడాది డిసెంబర్ లో విడుదలై.. వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. అయితే రెండో భాగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై రకరకాల న్యూస్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ లో భాగమైన ప్రముఖ నటుడు షఫీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. "సలార్ 2 త్వరలోనే మొదలవుతుంది. రెడీగా ఉండండి." అని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన షఫీ.. ఒక పోస్టర్ ను కూడా పంచుకున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. షఫీ లాంటి ప్రముఖ నటుడు చెప్పాడంటే డౌట్ లేకుండా త్వరలోనే 'సలార్ 2' షూటింగ్ స్టార్ట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా కమిటై ఉన్నాడు. 'సలార్ 2' కంటే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ముందు స్టార్ట్ అవుతుందని ఇటీవల న్యూస్ వినిపించింది. కానీ షఫీ తాజా పోస్ట్ తో అందులో వాస్తవం లేదని తేలిపోయింది. అక్టోబర్ లోపు 'సలార్ 2' పూర్తి చేసి, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.