English | Telugu

వైఫ్,కొడుకు కోసం మందు,వయలెన్స్ వదిలిపెట్టాను..కానీ తేడా వస్తే 

తమిళ సూపర్ స్టార్ అజిత్ అప్ కమింగ్ మూవీ 'గుడ్ బాడ్ అగ్లీ'(Good Bad Ugly).ఏప్రిల్ 10 న తమిళ,తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ కి 'అధిక్ రవిచంద్రన్'(adhik Ravichandran)దర్శకుడు కాగా త్రిష(Trisha)ప్రభు,అర్జున్ దాస్,ప్రసన్న,సునీల్,యోగిబాబు,రెడీన్ కింగ్ స్లే,జాకీ ష్రఫ్,ప్రియాప్రకాష్ వారియర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

రీసెంట్ గా 'గుడ్ బాడ్ అగ్లీ'తెలుగు ట్రైలర్ రిలీజ్ అవ్వగా 'ఏకే' అనే క్యారక్టర్ లో అజిత్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే విషయం అర్ధమవుతుంది.దమ్ము నా కోసం వదిలిపెట్టా,మందు నా వైఫ్ కోసం వదిలిపెట్టా.వయలెన్స్ నా కొడుకు కోసం వదిలిపెట్టా.కానీ నా కొడుక్కి ఆపద వస్తే వదిలింది పట్టుకోవాలిగా అని అజిత్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ లో ప్రధాన హైలెట్ గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్ తో మూవీ ఏ లక్ష్యం కోసం తెరకెక్కిందో కూడా అర్థమైపోతుంది.మూవీలోని మిగతా క్యారక్టర్ లు కూడా ఏకే గురించి రకరకాలుగా చెప్పడం,'ఐ యామ్ బాడ్ బాయ్' అని అజిత్ చెప్పడం క్యూరియాసిటీని కలిగిస్తుంది.

ట్రైలర్ ఆసాంతం డైలాగులు కూడా చాలా ఆసక్తికరంగా ఉండి,అభిమానులకి,ప్రేక్షకులకి కావాల్సినంత సినీ వినోదాన్ని అందించడం పక్కా.తెలుగు అగ్ర నిర్మాతలు మైత్రి మూవీస్ అధినేతలైన రవిశంకర్,నవీన్ సుమారు 250 కోట్ల బడ్జెట్ తో అజిత్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు.జి వి ప్రకాష్ కుమార్(Gv Prakashkumar)సంగీతాన్ని అందించగా అభినందన్ రామానుజం ఫొటోగ్రఫీ అందించాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.