English | Telugu

జెనీలియా పెళ్ళి తేదీ

జెనీలియా పెళ్ళి తేదీ ఫిబ్రవరి నాలుగని తెలిసింది. వివరాల్లోకి వెళితే గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం "బోయ్స్"తో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి, ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత "బొమ్మరిల్లు" చిత్రంతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న నటి జెనీలియా డిసౌజా. జెనీలియా ఉషాకిరణ్ మూవీస్ వారు "నువ్వే కావాలి" చిత్రాన్ని హిందీలో "తుఝే మేరీ కసమ్" పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రంలో హీరోగా నటించిన రితేష్ దేశ్ ముఖ్ తో లవ్ లో పడింది.

అప్పటి నుండీ వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. రితేష్ దేశ్ ముఖ్ మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పనిచేసిన విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంది చాలు ఇక పెళ్ళిచేసుకుందామనుకున్నారు. దానికి ఫిబ్రవరి 4 వ తేదీని తమ వివాహం చేసుకోటానికి నిర్ణయించుకున్నారు. అదీ సంగతి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.