English | Telugu
దుల్కర్ సల్మాన్ కి అనారోగ్యం..షూటింగ్ కంటే ఆరోగ్యం ముఖ్యం
Updated : Oct 22, 2024
మహానటి,సీతారామంతో తెలుగుప్రేక్షకుల అభిమాన కధానాయకుడుగా మారిన హీరో దుల్కర్ సల్మాన్(Dulquer salmaan)ప్రస్తుతం లక్కీ భాస్కర్(lucky baskhar)అనే మూవీతో దివాలి కానుకగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మీనాక్షి చౌదరి(meenkashi chaudhary)అయేషా ఖాన్ లు హీరోయిన్స్ గా చేస్తుండగా సితార ఎంటర్ టైన్మెంట్స్,ఫార్చూన్‌ఫోర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా అనారోగ్యం వల్లనే లక్కీ భాస్కర్ షూటింగ్ లేట్ అయ్యింది.టీం మొత్తం నన్ను ఎంతగానో సపోర్ట్ చేసింది.దర్శక నిర్మాతల దగ్గర్నుంచి లైట్ మెన్ వరకు నన్ను అందరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.షూటింగ్ ఆపేద్దాం ఇం టికి వెళ్ళండి అని చెప్పే వారు కానీ అంత పెద్ద భారీ సెట్ వేసినప్పుడు నా కోసం అది ఆగిపోకూడదని నొప్పిని భరిస్తూనే షూటింగ్ లో పాల్గొనేవాడిని.సినిమాల మధ్య గ్యాప్ తీసుకోవడం నాకు నచ్చదు.ఈ ఏడాది మరో రెండు సినిమాలు రిలీజ్ కావలసింది.కానీ కొన్ని కారణాల వల్ల ఒక సినిమా క్యాన్సిల్ అయ్యింది.మరొకటి చివరి నిమిషంలో వర్క్ అవుట్ కాలేదని చెప్పుకొచ్చాడు.
దర్శకుడు వెంకీ అట్లూరి(venki atluri)కూడా దుల్కర్ హెల్త్ విషయం పై మాట్లాడుతు జనరల్ గా నటులు పది గంటల దాకా పని చేస్తారు.కానీ దుల్కర్ పదిహేను గంటల దాకా వర్క్ చేసేవాడు.షూటింగ్ కంటే ఆరోగ్యం ముఖ్యమని చెప్పినా కూడా వినలేదని చెప్పుకొచ్చాడు.తొలిప్రేమ, రంగ్ దే, మజ్ను, సార్ వంటి విభిన్నమైన చిత్రాలు వెంకీ దర్సకత్వంలో రావడంతో లక్కీ భాస్కర్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.