Read more!

English | Telugu

స్విస్ లో మహేష్ దూకుడు యాక్షన్ సీన్లు

స్విస్ లో మహేష్ బాబు "దూకుడు" యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, "ఏమాయ చేశావే" ఫేం సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథాచిత్రం "దూకుడు". మహేష్ బాబు "దూకుడు" సినిమా షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్ ల్యాండ్ లో జరుగుతూంది. అక్కడ మహేష్ బాబు "దూకుడు" సినిమా తాలూకు ఒక పాటను ప్రిన్స్ మహేష్ బాబు, హీరోయిన్ సమంతలపై, దినేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు.

అలాగే మహేష్ బాబు విలన్లతో పోరాడే సన్నివేశాలను కూడా అక్కడే షూట్ చేస్తున్నారు. పనిలో పనిగా ఈ వేసవి కాలం ఎండలను తప్పించుకోటానికి మహేష్ బాబు కూడా ఒక వారంపాటు యూరప్ లో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. మహేష్ బాబు "దూకుడు" సినిమా ఆడియోని మే 31 వ తేదీన ఘనంగా రిలీజ్ చేసి, మహేష్ బాబు "దూకుడు" మూవీని మాత్రం ఆగస్టు 12 వ తేదీన రిలీజ్ చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది.