English | Telugu

ఆ హీరో నేను ఒకే ఫ్యామిలీ అనే విషయం అతని కళ్ళు చూస్తేనే అర్ధమవుతుంది

పూరి జగన్నాధ్(puri jagannadh)దర్శకత్వంలో వరుణ్ తేజ్(varun tej)హీరోగా 2015 లో వచ్చిన మూవీ లోఫర్.ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ దిశా పటాని(disa patani) ఆ తర్వాత బాలీవడ్ లో పలు చిత్రాలకి పని చేసిన దిశా  లేటెస్టుగా ప్రభాస్ తో కల్కి లో జత కట్టి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.ఇప్పుడు నవంబర్ 14 న విడుదల కాబోతున్న సూర్య (suriya)ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా మూవీ కంగువ(kanguva)లో ఏంజెలినా అనే ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.

రీసెంట్ గా కంగువ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఒక ఇంటర్వ్యూ లో  ఆమె మాట్లాడుతు సూర్య తో కలిసి పని చెయ్యడం మర్చిపోలేని అనుభవం.ఆయన కంటే తన కళ్ళు ఎక్కువుగా మాట్లాడతాయి. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. షూటింగ్ సమయంలో ఎదురైన ఎన్నో సవాళ్ళని చిత్ర యూనిట్ సహకారంతోనే ఎదుర్కొన్నాను. నా కెరీర్ లో ఇప్పటికీ నమ్మశక్యం కానీ క్షణాలు ఇవి. ఎందుకంటే ఈ చిత్రంలో అద్భుతమైన వ్యక్తులు, దర్శకుడు,నటి నటులతో కలిసి పని చేశాను.

తక్కువ సమయంలోనే మేమంతా ఒక కుటుంబసభ్యులమయ్యాం. నటి నటులు సెట్స్ కి వచ్చినప్పుడు చాలా సంతోషంగా పని చేసుకోవాలని కోరుకుంటున్నానని దర్శకుడు శివ(siva)నాకు మొదటి రోజే చెప్పాడు. ఆయన కోరుకున్నట్టుగానే అందరం చాలా సంతోషంగా ఉంటూ మూవీని కంప్లీట్ చేసాం. నన్నెంతో చాలా  జాగ్రత్తగా కూడా  చూసుకున్నారు. బాబీ డియోల్, జగపతి బాబు  లాంటి లెజండ్స్ తో కూడా పని చేసే అవకాశం కూడా కంగువ తో వచ్చిందని చెప్పుకొచ్చింది.