English | Telugu

‘దేవర’ ట్రైలర్‌ రిలీజై 24 గంటలైంది.. మరీ ఇంత దారుణమా?

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దేవర’ చిత్రం రిలీజ్‌కి ముందే రికార్డుల మోత మోగిస్తోంది. సెప్టెంబర్‌ 10 సాయంత్రం విడుదలైన ‘దేవర’ ట్రైలర్‌ ప్రతి క్షణం లక్షల వ్యూస్‌ పెంచుకుంటూ ఎంతో వేగంగా కేవలం 24 గంటల్లో 55 మిలియన్‌ వ్యూస్‌ సాధించి రికార్డు సృష్టించింది. ఈమధ్యకాలంలో ఏ సినిమా ట్రైలర్‌కి ఇంతటి భారీ వ్యూస్‌ రాలేదు. సినిమాపై ప్రేక్షకుల్లో వున్న ఎక్స్‌పెక్టేషన్సే రికార్డు స్థాయిలో వచ్చిన వ్యూస్‌కి కారణం. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌కి విపరీతమైన వ్యూస్‌ లభించాయి.

 

కొరటాల శివ ఇప్పటి వరకు టచ్‌ చేయని కాన్సెప్ట్‌తో రూపొందిన ‘దేవర’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగాన్ని సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి విడుదలవుతూ వస్తున్న గ్లింప్స్‌, పోస్టర్స్‌, సాంగ్స్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ట్రైలర్‌ చూసిన తర్వాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రెండు పాత్రల్లో ఎన్టీఆర్‌ నట విశ్వరూపం ఎలా ఉంటుందో ట్రైలర్‌లో శాంపిల్‌గా చూపించారు. ఈ రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయని ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించడం సినిమాకి ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది. అలాగే అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ‘దేవర’ చిత్రంతోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ అయింది. ట్రైలర్‌ విషయంలోనే ఇంత జోరు చూపిస్తున్న దేవర రేపు థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.