English | Telugu

జానీ మాస్టర్‌ కేసు.. కీలక సమాచారాన్ని విడుదల చేసిన డిప్యూటి కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌!

ప్రస్తుతం టాలీవుడ్‌లో జానీ మాస్టర్‌ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని అసిస్టెంట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివరాల గురించి ఒక ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది సైబరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌. వారు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోని అంశాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం.

బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 15-09-2024న నార్సింగి పోలీసులు క్రైమ్‌ నెం. 1371/2024 యు/ఎస్‌ 376(2)(ఎన్‌), 506, 323 ఐపిసి. నిందితుడు జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషా 2020లో ముంబైలో పని చేస్తున్నప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, లైంగిక వేధింపులను కొనసాగించాడని, ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయగా, నేరం జరిగినప్పుడు ఆమె మైనర్‌ అని వెల్లడైంది. కాబట్టి, పోక్సో చట్టం 2012లోని 5 (ఐ) ఆర్‌/డబ్ల్యు 6 పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్‌ జోడించబడింది. 19-09-2024న నిందితుడిని గోవాలో పట్టుకుని స్థానిక గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ పొందారు. నిందితుడిని హైదరాబాద్‌ తీసుకొచ్చి రెగ్యులర్‌ కోర్టులో హాజరు పరచనున్నారు.