English | Telugu

యన్ టి ఆర్ "దమ్ము" కోసం భారీ సెట్స్

యన్ టి ఆర్ "దమ్ము" కోసం భారీ సెట్స్ వేశారు. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, త్రిష, కార్తీక హీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో, అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం" దమ్ము". ఈ చిత్రంలోని ఒక పాటను చిత్రీకరించటానికి రామోజీ ఫిలిం సిటీలో నాలుగు భారీ సెట్లు వేశారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ "దమ్ము" చిత్రం ఇప్పటికే బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. నైజాం ఏరియా పంపిణీ హక్కులను తొమ్మిది కోట్ల ఫ్యాన్సీ ఆఫరిచ్చి దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అలాగే మిగతా ఏరియాలు కూడా భారీ మొత్తాలకు పంపిణీ హక్కులను నిర్మాత అమ్ముతున్నారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.