English | Telugu
కమిటీ కుర్రోళ్లు ఓటిటి లోకి వచ్చేస్తుంది.. డేట్ మీకు తెలుసా
Updated : Sep 6, 2024
కమిటీ కుర్రోళ్లు(committee kurrollu)చిన్నసినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొని మాది పెద్ద సినిమా అని నిరూపించింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల(niharika konidela)సమర్పణలో అందరు కొత్త నటీనటులు కావడంతో రిలీజ్ టైం లో కమిటీ కుర్రోళ్లు మీద అందరిలో చిన్న పాటి క్యూరియాసిటీ కూడా ఏర్పడింది.ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి అడుగుపెట్టబోతుంది.
ఓటిటి రంగంలో అప్రహాతీతంగా దూసుకుపోతున్న ఈటీవీ విన్ భారీ ధరని చెల్లించి కమిటీ కుర్రోళ్లు ఓటిటి హక్కులని కైవసం చేసుకుంది. ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా ఏరియాల్లో కమిటీ కుర్రోళ్లు కలెక్షన్స్ ఇప్పటికి బాగానే ఉన్నాయి. కానీ పన్నెండు న ఈటీవీ విన్ ద్వారా సగర్వంగా ఓటిటి లోకి అడుగుపెడుతుంది. ఒక రకంగా ఓటిటి సినీ ప్రేమికులకి బంపర్ ఆఫర్ అని కూడా చెప్పవచ్చు.గోదావరి జిల్లాల్లోని పురుషోత్తంపల్లి అనే పల్లెటూరిలో పన్నెండేళ్లకి ఒకసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అందులో నిర్వహించే బలి చేట ఉత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.కాకపోతే ఈసారి జాతర జరిగే పది రోజుల్లో ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా జరిపించాలని ఊరి పెద్దలు నిర్ణయిస్తారు.ఎప్పుడు లేనిది ప్రస్తుత సర్పంచ్‌పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్లలో ఒకడు ముందుకొస్తాడు.కానీ జాతర సమయంలో జరిగిన గొడవల దృష్ట్యా ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం ఉండదంటూ పంచాయితీ తీర్మానిస్తుంది. అసలు జాతర సవ్యంగా జరిగిందా? ఊరి సర్పంచ్ ఎన్నికల్లో కుర్రోళ్లు గెలిచారా లేదా అన్నదే మిగిలిన కథ. యదు వంశీ దర్శకుడు కాగా శరణ్య సురేష్, సందీప్ సరోజ్, ప్రసాద్ బెహ్రా,ఈశ్వర్ రాచి రాజు తో పాటు సీనియర్ నటులు సాయి కుమార్, గోపరాజు రమణ తదితలు ముఖ్య పాత్రల్లో మెరిశారు.