English | Telugu

చిరు 150 వ సినిమాలో శ్రీకాంత్

చిరు 150 వ సినిమాలో శ్రీకాంత్ నటించనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే "శంకర్ దాదా జిందాబాద్" సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అసిస్టెంట్ ఎటియమ్ గా నటించాడు. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళటం, శ్రీకాంత్ కి ప్రాథాన్యత లేకుండా చేయటంతో శ్రీకాంత్ తన సినిమాల్లో తాను నటిస్తూ, మెగాస్టార్ కేంపుకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత చిరు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రేస్ పార్టీలో కలపటం జరిగింది.

మొన్నామధ్య శ్రీకాంత్ తమ్ముడు అనీల్ స్థలాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి ఆక్రమించిన గొడవలో శ్రీకాంత్ కి మళ్ళీ చిరునే దిక్కయ్యాడు. ఆ స్థలం మళ్ళీ శ్రీకాంత్ తమ్ముడు అనీల్‍ సోంతమయ్యేలా చిరునే అవసరమైన చర్యలు తీసుకున్నాడట. దాంతో మళ్ళీ శ్రీకాంత్ మళ్ళీ మెగా శిబిరంలోకి రావటం జరిగింది. దాంతో చిరు 150 వ సినిమాలో శ్రీకాంత్ నటించనున్నాడనే రూమర్ ఫిలిం నగర్ వర్గాల్లో రాజ్యమేలుతోంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ శాశ్వత శతృత్వం కానీ, శాశ్వత మిత్రత్వం కానీ ఉండవనీ, అక్కడ ఎప్పుడైనా, ఏదైనా జరుగవచ్చనే మాట అక్షర సత్యం కదూ.