Read more!

English | Telugu

మహర్షి రాఘవ చేసిన పనికి అందరూ షాక్.. ఇంటికి పిలిచి సన్మానం చేసిన చిరంజీవి

చిరంజీవి బ్లడ్ బ్యాంక్(chiranjeevi blood bank) రక్తం లేకుండా ఎవరు ప్రాణాలని పోగొట్టుకోకూడదని భావించిన చిరంజీవి(chiranjeevi)1998 లో దాన్ని  స్థాపించారు. అంటే ఇప్పటికి  26 సంవత్సరాలు అవుతుంది.ఆయన ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అప్పటి నుంచి నేటి వరకు ఎంతో మందికి  రక్త నిదులని అందిస్తుంది.  దీనికంతటకీ ప్రధాన కారణం అభిమానులు. వాళ్ళు లేనిదే ఆ బ్లడ్ బ్యాంక్ లేదు.ఈ విషయాన్ని చిరు చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు ఈ విషయం మీదే  ఆయన ఒక నటుడిని ఇంటికి పిలిపించుకొని మరీ సన్మానం చేసారు. 

మ‌హ‌ర్షి రాఘ‌వ(maharshi raghava)మహర్షి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాలోని పాటలు నేటికీ ఎక్కడో ఒక చోట మారుమోగిపోతూనే ఉంటాయి. ఆ తర్వాత  కూడా ఎన్నో సినిమాల్లో మంచి మంచి  పాత్రల్ని పోషిస్తు తన కంటు ఒక గుర్తింపుని సంపాదించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం రాఘవ  చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసాడు. ఏకంగా 100 వ సారి రక్తదానం చేసి రికార్డు సృష్టించాడు. 100వ సారి ర‌క్త‌దానం చేస్తున్నప్పుడు  కచ్చితంగా నేను వస్తానని  గతంలో  రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.అయితే అనుకోకుండా ఆ  స‌మ‌యంలో చిరంజీవి చెన్నైలో ఉండాల్సి వచ్చింది.దాంతో ఇప్పుడు  రాఘ‌వ‌ను ప్ర‌త్యేకంగా తన  ఇంటికి ఆహ్వానించి  ఘనంగా సత్కరించారు.మూడు నెల‌ల‌కు ఒకసారి చొప్పున  100 సార్లు ర‌క్త‌దానం చేయ‌టం గొప్ప‌విష‌య‌మ‌ని అన్నారు.అలాగే ఈ విధంగా ర‌క్త‌దానం చేసిన వ్య‌క్తుల్లో మ‌హ‌ర్షి రాఘ‌వ ప్ర‌ప్ర‌థ‌ముడని కూడా చిరు  అభినందించారు.
 
ఈ సమయంలో రాఘవ వెంట  సతీమణి శిల్పా కూడా ఉన్నారు. ఆమె కూడా నటినే. చిరంజీవి ఆపద్బాంధవుడు లో ఒక మంచి పాత్రని కూడా పోషించింది. ఇక ఇప్పుడు అందర్నీ ఇంకో విషయం  మెస్మరైజ్ చేస్తుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించినప్పుడు రక్తం ఇచ్చిన రెండో వ్యక్తి మహర్షి రాఘవనే. ఆ మొదటి వ్యక్తి ఎవరో కాదు. ప్రముఖ సినీ నటుడు ,నిర్మాత మురళీ మోహన్. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి బ్లడ్ ఇచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. రాఘవ తో పాటు చిరు ని కలిసి ఆ విషయాలన్నింటిని గుర్తు చేసుకున్నారు .చిరు, మురళీ మోహన్ లు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.ఇప్పటికీ ఇద్దరు  సోదరభావంతో ఉంటారు.