English | Telugu

చిరంజీవి నట ప్రస్థానానికి యాభై ఏళ్ళు  

తెలుగు సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవిchiranjeevi)కి ఉన్న చరిష్మా గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో డాన్స్ లతో, ఫైట్స్ తో తాను ఎదగడమే కాకుండా తెలుగు సినిమాని కూడా ఎదిగేలా చేసాడు.ప్రస్తుతం సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కతున్న విశ్వంభర(Vishwambhara)లో ఒక ఎనర్జటిక్ రోల్ లో  చేస్తున్నాడు.యంగ్ హీరోలకి ధీటుగా రెగ్యులర్ గా  షూటింగ్ లో పాల్గొంటూ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.


రీసెంట్ గా చిరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసాడు.1974 లో నర్సాపూర్ వైఎన్ఎం కాలేజీ లో తొలిసారి కోన గోవింద రావు గారి రచనలో 'రాజీనామా' అనే నాటకంలో నటించాను.నటుడిగా తొలి గుర్తింపుని  పొందటంతో పాటు,ఉత్తమ నటుడుగా కూడా అవార్డు గెలుచుకున్నాను. అది నాకు నటనలో ఎదగడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ రకంగా చూసుకుంటుంటే నా నటనకి యాభై  సంవత్సరాలు పూర్తయినట్టే.ఈ విషయంలో ఎనలేని ఆనందంగా ఉందంటూ ట్వీట్  చేసాడు. యుక్త వయస్సులో ఉన్న అప్పటి  పిక్ ని కూడా షేర్ చెయ్యటం జరిగింది.అందులో చిరు ఒరిజినల్ నేమ్ తో పాటు ఆయన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి.

చిరు నటించిన తొలి సినిమా పునాది రాళ్లు అయినా కూడా రిలీజైన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు.1979 లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. అంటే రంగస్థలం మీద అవార్డుని అందుకున్న కొన్ని సంవత్సరాలకే చిరు సినీరంగ ప్రవేశం చేసి నేటికీ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు.ఇక చిరు పోస్ట్ అండ్ పిక్ చూసిన ఫ్యాన్స్ అయితే చిరు కి కంగ్రాట్స్ చెప్తున్నారు.