English | Telugu

చిరు, బాలయ్య మంచి ఫ్రెండ్స్ - మురళీ మోహన్

చిరు, బాలయ్య మంచి ఫ్రెండ్స్ అని మురళీ మోహన్ ఇటీవల అన్నారు. వివరాల్లోకి వెళితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, యువరత్న నందమూరి బాలకృష్ణల మధ్య మాటల యుద్ధం జరుగుతూంది. ఈ విషయంపై స్పందించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీ మోహన్, నిజానికి చిరంజీవి, బాలయ్య ఇద్దరూ కూడా చాలా మంచి స్నేహితులనీ, రాజకీయపరమైన విభేదాలే కానీ, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలేమీ లేవనీ, వారిమధ్య లేనిపోని వివాదాలను సృష్టిస్తుంది మీడియానేననీ, మీడియా సంయమనం పాటించాలనీ మురళీ మోహన్. ఈ మధ్య చిరంజీవి, బాలకృష్ణల అభిమానులు వాళ్ళిద్దరి దిష్టిబొమ్మలనూ తగులబెట్టటం జరిగింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.