English | Telugu
చిరంజీవిని ఇబ్బంది పెట్టవద్దని రేవంత్ రెడ్డి అన్నాడా!
Updated : Dec 26, 2024
తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన హీరోలు, డైరెక్టర్స్,నిర్మాతలందరు కలిసి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ని కలవటం జరిగింది.ఈ భేటీలో తెలుగు పరిశ్రమకి చెందిన పలు సమస్యలతో పాటు చిత్ర పరిశ్రమ మరింతగా డెవలప్ కావడానికి ఏమేం చెయ్యాలో రేవంత్ రెడ్డి కి పలువురు సూచించించడం జరిగింది.రేవంత్ రెడ్డి అందుకు సముఖత వ్యక్తం చేయడమే కాకుండా ఆయన కూడా పరిశ్రమకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షో లు,కానీ అధిక రేట్స్ కానీ ఉండవని తేల్చి చెప్పారు కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ ఇష్యు కి సంబంధించిన గొడవలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఈ అంశం మీదే మాట్లాడనేది తెలిసిన విషయమే
ఇక ఈ భేటీ ఖాయమైన రోజు నుంచి మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కూడా హాజరవుతున్నాడని పలు వార్తా ఛానల్స్ లో కధనాలు వచ్చాయి.కానీ ఈ రోజు జరిగిన భేటీకి చిరు హాజరు కాలేదు.దీంతో ఎందుకు హాజరు కాలేదనే విషయంలో సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.చిరంజీవి చెన్నైలో ఉండటంవలన చిరంజీవి గార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని దిల్ రాజుతో రేవంత్ రెడ్డి చెప్పాడనే టాక్ నడుస్తుంది. నాగార్జున,వెంకటేష్, కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అడవి శేషు,కిరణ్ అబ్బవరం,రామ్ పోతినేని, జొన్నల గడ్డ సిద్దు, శివ బాలాజీ,దిల్ రాజు,అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్,సుప్రియ యార్లగడ్డ, చినబాబు,నాగవంశీ,నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, రవికిషోర్,కె ఎల్ నారాయణ,భోగవల్లి ప్రసాద్,నాగబాబు,జెమినీ కిరణ్, ప్రసన్న, యువి వంశీ, 14 రీల్స్ గోపి,రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్,సి కళ్యాణ్, సునీల్ ఇలా మొత్తం 36 మంది రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు.