English | Telugu

'జ్యోతిలక్ష్మి' 'మంత్రం' వేస్తుందా?

ఎంత త్వరగా చుట్టేశామ్ అన్నది కాదు....మేటరుందా లేదన్నదే ముఖ్యం. గతంలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్న పూరీ జగన్నాధ్ ఈ మధ్య ఆ మాటే మరిచాడు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు చార్మి జ్యోతిలక్ష్మిపై పడేట్టుంది. ఎందుకంటే మూడేళ్ల క్రితం వచ్చిన బిజినెస్ మెన్ తర్వాత మళ్లీ పూరి హిట్టు మొహమే చూడలేదు. అయినా మూడంటే మూడు నెలలే అంటూ చకచకా షూటింగ్ పూర్తిచేసేసి థియేటర్లలో సినిమా వదిలేస్తున్నాడు. అరడజనుకు పైగా సినిమాలు ఇలా విడుదల చేసే దెబ్బతిన్నాడు. అయినా ఆలోచించడం లేదు. లెటెస్ట్ గా ఫేడవుట్ అయిపోయిన ఛార్మిపై మనసుపడ్డ పూరీ....అమ్మడితో హాట్ హాట్ గా జ్యోతిలక్ష్మి తెరకెక్కించాడు. బుధవారంలో గుమ్మడికాయ కూడా కొట్టేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషన్ కూడా త్వరలోనే పూర్తిచేసేసి....మే నెలాఖరుకి సినిమా విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. దీంతో అంత కంగారేల అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాపులిచ్చినా... ప్రేక్షకులకి పూరీపై అంతో ఇంతో నమ్మకం ఉండేది....కానీ... ఈ మధ్య ఆ నమ్మకం కాస్త సన్నగిల్లుతోంది. ఆ ఎఫెక్ట్ జ్యోతిలక్ష్మిపై పడేట్టుంది కూడా. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సినిమా విడుదల చేస్తే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ అయితే పూరీ కన్నా ఛార్మీకే కష్టాలెక్కువ. మరి జ్యోతిలక్ష్మితో మంత్రం వేయాలనుకుంటున్న ఛార్మి కోరిక నెరవేరుతుందా?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.