Read more!

English | Telugu

మూడోసారి విడాకులు తీసుకున్న సింగర్.. జల్సా లో పవన్ కళ్యాణ్  చెప్పాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన  జల్సా లో ఒక సాంగ్ ఉంటుంది. జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి. బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ  క్యాడ్బరి. ఇప్పుడు ఈ  బ్రిట్నీ స్పియర్స్ కి సంబంధించిన ఒక వార్త యావత్తు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది.     


పవన్ కళ్యాణ్ చెప్పిన  బ్రిట్నీ స్పియర్స్ ఎవరో కాదు.  హాలీవుడ్ సినీ జగత్తు ని ఒక ఊపు ఊపిన పాప్ సింగర్. పంతొమ్మిది    ఏళ్ళ వయసులోనే పాప్ సింగర్ గా అరంగేట్రం చేసింది. తన ఫస్ట్  ఆల్బమ్ పేరు బేబీ వన్ మోర్ టైం.ఇక అక్కడనుంచి ఆమె  చేసిన ప్రతి ఆల్బమ్ వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి. కొన్ని కోట్ల మంది ప్రజలు  ఆమె ఆల్బమ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు. తాజాగా ఆమె పర్సనల్ విషయం ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది.  తన భర్త సామ్ అస్గారి నుంచి విడాకులు తీసుకుంది. నిజానికి వాళ్లిద్దరు ఎనిమిది నెలల కిందటే విడిపోయారు. విడాకులకు కారణం తమ మధ్య ఉన్న అవగాహనా లోపమే అని బ్రిట్నీ స్పియర్స్ తెలిపింది.బ్రిట్నీ వయసు నలభై రెండు సంవత్సరాలు కాగా    సామ్ వయసు  వయసు ముప్పై  సంవత్సరాలు కావడం గమనార్హం

 ఇక  బ్రిట్నీ  విడాకులు తీసుకోవడం ఇది  మూడో సారి. 2004లో తన చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్‌ తో మొదటి సారి  వివాహం జరిగింది. ఏడాది  తర్వాత ఆ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత  కెవిన్ ఫెడెర్‌లైన్‌ను వివాహం చేసుకుంది. 2007లో ఆ ఇద్దరు  విడాకులు తీసుకున్నారు. ఇక నలభై  రెండు సంవత్సరాల వయసులో  బ్రిట్నీ  మూడోసారి విడాకులు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవ్రి టైం, ఊప్స్ ఐ డిడ్ ఇట్ అగైన్, జిమ్మి మోర్, ఐ యాం స్లేవ్ ఫర్ యు, బ్రిట్నీ, పీస్ ఆఫ్ మీ, టాక్సిక్,హోల్డ్ ఇట్ ఎగైనిస్ట్ మీ తదితర హిట్ ఆల్బమ్స్ తో కోట్లాది మంది అభిమానులని సంపాదించింది