Read more!

English | Telugu

బ్రహ్మోత్సవం కొత్త టీజర్ కూడా కాపీయేనట..!

బ్రహ్మోత్సవం సినిమాను కాపీ అన్న మాట వదలట్లేదు. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ ను ఒక హాలీవుడ్ సాంగ్ కాపీ అని, మోషన్ పోస్టర్ ను రాజస్థాన్ టూరిజం యాడ్ అని డిసైడ్ చేసేసిన జనాలు, నిన్న రిలీజైన సాంగ్ టీజర్ ను కూడా కాపీ అని తేల్చేస్తున్నారు. మధురం మధురం అంటూ సాగే ఈ సాంగ్ ను పూర్వకాలం వల్లభాచార్యుడు శ్రీకృష్ణుడి మీద రాసిందని, యాజ్ ఇటీజ్ గా అదే మధురాష్టకాన్ని సినిమాకోసం తీసేసుకున్నారని, పూర్తిగా కాపీ అని విమర్శిస్తున్నారు కొంతమంది. కానీ మహేష్ అభిమానులు మాత్రం ఇది కాపీ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అందుకు కూడా కారణం లేకపోలేదు. ఇది కేవలం ఒక ట్యూన్ లా వినబడిన బిట్ మాత్రమే. ఇదే పాట అని చెప్పలేం. పైపెచ్చు మధురాష్టకంతో పాటు ట్రెడిషినల్ సాంగ్స్ ను సినిమాల్లోకి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. రవితేజ షాక్ సినిమాలో ఇదే శ్లోకాన్ని భార్యాభర్తల అనుబంధానికి తగ్గట్టుగా మలిచారు. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం అంటూ మధురాష్టకాన్ని పాటలా తీసుకున్నారు. మార్నింగ్ రాగా సినిమాలో తాయే యశోద అనే తమిళ్ ట్రెడిషనల్ ను పాడారు. అది తర్వాత సూపర్ హిట్ కూడా అయింది. కాబట్టి ఇది కాపీ ఎలా అవుతుంది అంటూ మహేష్ అభిమానులు కౌంటర్ వేస్తున్నారు. సినిమా రిలీజైతే తప్ప ఈ కాపీ కథలకు ఒక సమాధానం దొరకదు.