English | Telugu

దేవర టికెట్స్ విషయంలో బ్లాక్ మార్కెటింగ్ జరిగిందేమోనని కోర్టు నోటీసులు 

కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు మూవీ లవర్స్ అందరు ఆన్ లైన్ సంస్థల ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం  పరిపాటయ్యింది.ఇక అగ్ర హీరోల సినిమాల విషయంలో అయితే చెప్పక్కర్లేదు.తమ హీరో మూవీ ఎప్పుడెప్పుడు ఆన్ లైన్ లోకి వస్తుందా అని కంటి మీద కునుకు కూడా లేకుండా పడిగాపులు కాస్తు ఉంటారు.

ఇక ఆన్ లైన్ లో టికెట్స్ బుకింగ్ చేసుకునే సంస్థల్లో బుక్‌మై షో యాప్ కూడా ఒకటి.ఆ సంస్థ సీఈవో ఆశిష్‌ హేమ్‌రజనికి  టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణలతో ముంబై పోలీసులు కోర్టు సమన్లు జారీ చెయ్యడం జరిగింది.నిజానికి ఈ కేసులో విచారణకి హాజరవ్వాలని ఈనెల 27 నే  సమన్లు జారీ చేసినా కూడా ఆశిష్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో విచారణకు హాజరుకావాలని  పోలీసులు మరోసారి సమన్లు జారీ చేసారు.

ఇక ఈ  విషయం సోషల్ మీడియాలో ప్రసారం అవుతుండంతో ఇటీవల రిలీజైన యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)దేవర(devara)కి సంబంధించిన టికెట్స్ విషయంలో కూడా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ జరిగిందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.