English | Telugu
శ్రీలీలకు చేదు అనుభవం.. పబ్లిక్ లో బలవంతంగా చేయి పట్టుకొని...
Updated : Apr 6, 2025
పబ్లిక్ ప్లేస్ లలో హీరోయిన్ లు జాగ్రత్తగా ఉండాలి. ఆకతాయిలు వారిని తాకాలని చూడటం, చెయ్యి పట్టుకొని లాగడం వంటివి చేస్తుంటారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా యంగ్ బ్యూటీ శ్రీలీలకు అలాంటి చేదు అనుభవం ఎదురైంది. (Sreeleela)
కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజా షెడ్యూల్ డార్జిలింగ్ లో జరిగింది. అక్కడ షూటింగ్ ముగిశాక కార్తిక్ ఆర్యన్ తో కలిసి శ్రీలీల తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఆ గుంపులో ఉన్న ఆకతాయిలు.. శ్రీలీల చేయి పట్టుకొని బలవంతంగా పక్కకు లాగారు. దీంతో శ్రీలీల ఒక్కసారిగా షాకైంది. అది గమనించిన సిబ్బంది, వెంటనే అప్రమత్తమై ఆమెను వారి నుంచి విడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆకతాయిల తీరుపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.