Read more!

English | Telugu

షూటింగ్ లోవర్మ, నాగచైతన్య బెజవాడ రౌడీలు

రెగ్యులర్ షూటింగ్ లోవర్మ, నాగచైతన్య "బెజవాడ రౌడీలు" సినిమా ఉందని తెలిసింది. వివరాల్లోకి వెళితే శ్రియ ప్రొడక్షన్స్ పతాకంపై, యువ హీరో నాగచైతన్య హీరోగా, వివేక్ కృష్ణ దర్శకత్వంలో, కోనేరు కిరణ్ కుమార్ ‍, ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మతో కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం" బెజవాడ రౌడీలు". ఈ నాగచైతన్య "బెజవాడ రౌడీలు" సినిమా షూటింగ్ విజవయాడ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతోంది. రామవరప్పాడు, గొల్లపూడి, బెంజ్ సర్కిల్, కంకిపాడు, కాళేశ్వరరావు మార్కెట్ తదితర ప్రాంతాల్లో నాగచైతన్య "బెజవాడ రౌడీలు" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

విజయవాడలోని రెండు వర్గాల మధ్య, అంటే దేవినేని, వంగవీటి అనే రెండు వర్గాల మధ్య గతంలో జరిగిన రాజకీయ ఆధిపత్యపోరే ఈ నాగచైతన్య "బెజవాడ రౌడీలు" సినిమాకి కథాంశంగా తెలిసింది. ఈ ఆధిపత్యపోరులో భయంకరంగా అనేక హత్యలు జరిగాయి. ఈ ఇతివృత్తంతో తీస్తున్న నాగచైతన్య "బెజవాడ రౌడీలు" సినిమా, గతంలో వర్మ తాను దర్శకుడిగా మారి, నాగార్జున హీరోగా తీసిన తొలి చిత్రం "శివ"లా నాగచైతన్యకు "బెజవాడ రౌడీలు" సినిమా కూడా అంత పెద్ద హిట్టవుతుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.