Read more!

English | Telugu

టైటానిక్ కెప్టెన్ మృతి 

1997 వ సంవత్సరంలో వచ్చిన  టైటానిక్ మూవీ ప్రపంచ సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. పైగా ప్రపంచ సినిమాని ఒక్కటిగా కూడా  చేసింది. లియో నార్డో డికా ప్రియో, కేట్ విన్స్లెట్  లు ప్రేమికులుగా కనిపించి స్వచ్ఛమైన ప్రేమకి సజీవ రూపాలుగా నిలిచారు. సినిమా అనేది ఉన్నంత కాలం ఆ ఇద్దర్ని మాత్రం ఎవరు మర్చిపోరు. అలాగే అందులో నటించిన ఇంకొంత మందిని కూడా మర్చిపోరు. అంతలా తమ పాత్రల్లో నటించారు. తాజాగా ఒక నటుడి విషయం  సినీ ప్రియుల్లో విషాదాన్ని నింపుతుంది. 

బెర్నార్డ్ హిల్.. టైటానిక్ లో  కెప్టెన్ ఎడ్వర్డ్‌ స్మిత్‌ గా  నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందాడు. నిన్న అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడిచాడు. ఆయన వయసు ప్రస్తుతం   79  సంవత్సరాలు.ది చైన్, గాంధీ,రన్నర్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ,మడగాస్కర్ స్కిన్, ది క్రిమినల్, త్రూ క్రైమ్, ఫ్రాంక్లిన్, గోల్డెన్ ఇయర్స్.నార్త్ వెర్సస్ సౌత్, ఇలా సుమారు 50 చిత్రాలకి పైనే చేసాడు. 2023 లో వచ్చిన ఫర్ ఎవర్ యంగ్ ఆయన చివరి చిత్రం. 1975 లో వచ్చిన ఇట్ కుడ్ హ్యాపేన్ టూ యు ఆయన మొదటి చిత్రం 

 పలు టీవీ సీరియల్స్ లోను నటించి ఎంతో పేరు సంపాదించాడు. ఎక్కువ భాగం  వరల్డ్ నెంబర్ వన్ ఛానల్  బిబిసి లో టెలికాస్ట్ అయ్యాయి. పలు  ప్రతిష్టాత్మక  అవార్డుల్ని కూడా గెలుచుకున్నాడు. యూకేలోని మంచెస్టర్‌ లో 1944లో  జన్మించారు. ప్రముఖ అమెరికన్ నటి అయిన మరియానా హిల్ ని మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు. అతని పేరు గాబ్రియల్.  ఇక  పలువురు ప్రపంచ సినీ ప్రముఖులు, ప్రేమికులు బెర్నార్డ్ హిల్  మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.